భారత దేశం లో వయోజనులకు, మహిళలకు, సెక్స్ వర్కర్ లకు సుప్రీంకోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది…

Written by TV2O TELUGU

Published on:

భారత దేశం లో వయోజనులకు, మహిళలకు, సెక్స్ వర్కర్ లకు సుప్రీంకోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది… ఈ మేరకు కీలక తీర్పు ఇచ్చింది..
స్వచ్ఛందంగా వేశ్యగా మారడం నేరం కాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది..
స్వచ్ఛందంగా వ్యభిచార వృత్తిని (వేశ్యావృత్తి) ఎంచుకోవడం నేరం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
విచారణ జరిపిన జస్టిస్ జె.బి. పర్దివాలా మరియు జస్టిస్ ఆర్. మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం
వయోజనులు తమ ఇష్టపూర్వకంగా ఈ వృత్తిని చేసుకునే హక్కు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కులో భాగమని తేల్చింది…
*18 సంవత్సరాలు నిండిన లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిని వయోజనులుగా పరిగణిస్తారని చెప్పింది..
లైంగిక కార్మికులు కూడా భారత రాజ్యాంగం ప్రకారం గౌరవం, సమాన రక్షణ పొందే హక్కు కలిగిన వృత్తి నిపుణులని పేర్కొంది.
పోలీసుల వేధింపులకు సుప్రీం కోర్ట్ అడ్డుకట్ట వేసింది..
సెక్స్ వర్కర్లు స్వచ్ఛందంగా ఈ వృత్తిలో ఉన్నప్పుడు వారిని పోలీసులు వేధించడం, అరెస్టు చేయడం లేదా శిక్షించడం చేయకూడదని ఆదేశించింది సుప్రీం ధర్మాసనం..
దాడులు (రైడ్స్) జరిగినప్పుడు వారిని బలవంతంగా రెస్క్యూ హోమ్స్ లేదా షెల్టర్లకు తరలించరాదని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు..
లైంగిక కార్మికులకు చట్టపరమైన హక్కులు ఉన్నప్పటికీ, వ్యభిచార గృహాలు (Brothels) నడపడం మరియు ఇతరులను బలవంతంగా లేదా అక్రమ రవాణా (Human Trafficking) ద్వారా ఈ కూపంలోకి దించడం చట్టరీత్యా నేరం అంది..కండోమ్‌లు కలిగి ఉండటం సెక్స్ వర్కర్‌కు వ్యతిరేకంగా నేరంగా పరిగణించరాదని… వారి ప్రైవసీని దెబ్బతీసేలా పోలీసులు వ్యవహరించవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది..

Leave a Comment