పోలీసులే దొంగలైతే .. ప్రజలకు రక్షణ ఎవరు..?

Written by TV2O TELUGU

Published on:

కర్నూలు జిల్లా – పోలీస్ దొంగ…
పోలీసులే దొంగలైతే .. ప్రజలకు రక్షణ ఎవరు..?
కర్నూల్ జిల్లా కోడుమూరు టౌన్ పోలీసుల నిర్వాకం పలు విమర్శలకు తావిస్తుంది . పలు కేసుల్లో సీజ్ చేసిన బైక్ లను కోర్టుకు సమర్పించి కోర్ట్ ఆదేశాల ప్రకారం నడుచుకోవాల్సిన పోలీసులు అడ్డదారులు తొక్కుతున్నారు.పలు కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను కోడుమూరు టౌన్ పోలీస్ స్టేషన్ లో కొనిస్టేబుల్ గా పనిచేస్తున్న జగదీష్ అక్రమంగా విక్రయిస్తున్న ఘటన వెలుగు చూసింది . గతంలో ఆదోని లో పనిచేసిన సమయం లో కూడా కొనిస్టేబుల్ జగదీశ్ పై పలు ఆరోపణలు ఉన్నాయి. కొందరు మధ్యవర్తులను ఏర్పాటు చేసుకుని స్టేషన్ లో ఉన్న సీజ్ చేసిన బైక్ లకు యజమానులగా తీసుకొచ్చి అధికారులను నమ్మించి వాటిని విక్రయించేవాడు.గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ తతంగాన్ని బైక్ యజమానులు ఒరిజినల్ ఆర్సీ లతో రావడంతో కానిస్టేబుల్ జగదీశ్ బాగోతం బయటపడింది. ఈ వ్యవహారం పై విచారణ చేపట్టిన అధికారులు విషయాన్ని గోప్యంగా ఉంచారు. ఇప్పటికే వాహనాలు అక్రమంగా కొనుగోలు చేసిన కోడుమూరు కు చెందిన కొంతమంది వ్యక్తుల నుంచి 5 బైక్ లను రికవరీ చేశారు . గతంలో కోడుమూరు పోలీసు స్టేషన్లో పని చేసిన హెడ్ కానిస్టేబుల్ ఖాదర్ వలి సీజ్ చేసిన స్కూటీని సైతం విక్రయించినట్టు తెలిసింది .ఇలాంటి అక్రమ వ్యవహారాల పై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది..

Leave a Comment