నల్లపాడు స్వయంభూ శ్రీ పుష్పాద్రి లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలోఘనంగా నవరాత్రి పూజలు

Written by TV2O TELUGU

Published on:

నవరాత్రులు స్పెషల్ : గుంటూరు జిల్లా నల్లపాడు …
గుంటూరు జిల్లా లోని ప్రముఖ అద్ధ్యాత్మిక క్షేత్రం నల్లపాడులో వేంచేసిన స్వయంభూ శ్రీ పుష్పాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయం లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనం గా నిర్వహించారు.ఈ క్షేత్రం లో జరిగే విశేష పూజా కార్యక్రమాలకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు.ది.25.09.25, గురువారం స్వాతి నక్షత్రం సందర్భంగా శ్రీ పుష్పాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారికి ఉ.7.30 గం లకు పంచామృత సహిత ఫలరస స్నపన మరియు విశేషార్చనలు నిర్వహించారు.అనంతరం మ.1.00 గం లకు అన్నసంతర్పణ జరుగునని ఆలయ నిర్వాహకులు తేలిపారు.కావున భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని తెలిపారు . శ్రీ నారసింహ జయ నారసింహ జయ శ్రీ పుష్పాద్రి లక్ష్మీనరసింహ…నరసింహ నామం మధురాతి మధురం నరసింహ దర్శనం సకల శుభమని పేర్కొన్నారు..

Leave a Comment